In spite of the best efforts of the Chief Minister, the Polavaram project is not progressing as fast as N Chandrababu Naidu would like it to so that water can be given by 2019 to the fields through gravitational flow.
పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. 2019 ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇవ్వాలని అధికార టిడిపి ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాలతో అధికార పార్టీ నిర్ణయాలు ఏ మేరకు ఫలిస్తాయోననే ఆందోళన కూడ లేకపోలేదు. అసలు వివాదమేమిటీ? ఎందుకు ఏపీలో పోలవరం ప్రాజెక్టు విషయమై పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోందో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలను తీసుకొంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పనుల్లో వేగం అనుకొన్నంతగా లేదని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చొరవ కారణంగానే ప్రాజెక్టు పనుల్లో ఈ మేరకైనా పురోగతి ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు . పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరిస్తామంటూనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల టిడిపి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందిపోలవరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగింది.ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రూ.54 వేల కోట్ల రూపాయలు అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తోంది. అసలు మొదట్లో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పది వేల కోట్ల రూపాయల లోపే ఉంది. ముంపు ప్రాంతాల్లో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ.2900 కోట్ల రూపాయలు అంచనా ఖర్చు వేశారు